గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2017 (06:58 IST)

చైనా వ్యక్తికి 'చిల్లీ కింగ్' పురస్కారం.. ఎందుకో తెలుసా? (Video)

ప్రపంచ వ్యాప్తంగా చిత్ర విచిత్రమైన పోటీలు జరుగుతుంటాయి. ఇలాంటి పోటీలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా చైనాలో ఓ విచిత్రమైన పోటీ జరిగింది. అదేంటంటే.. నీటి టబ్‌లో కూర్చొని పండు మిరపకాయలను ఆరగించాల

ప్రపంచ వ్యాప్తంగా చిత్ర విచిత్రమైన పోటీలు జరుగుతుంటాయి. ఇలాంటి పోటీలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా చైనాలో ఓ విచిత్రమైన పోటీ జరిగింది. అదేంటంటే.. నీటి టబ్‌లో కూర్చొని పండు మిరపకాయలను ఆరగించాలి. ఒక్క నిమిషంలో ఎక్కువ మిరపకాయలను తిన్నవారిని విజేతగా ప్రకటిస్తారు. 
 
ఈ తరహా పోటీ చైనాలోని హునాన్ ప్రాంతంలో జరిగింది. ఒక నిముషంలో అత్యధిక మిరపకాయలు తిని ఏడవకూడదనే నిబంధన పెట్టారు. ఇందుకోసం ముందుగా పోటీదారులు నీటితో నిండిన టబ్‌లో కూర్చోవాలి. ఆ తర్వాత ఆ టబ్‌ను మిరపకాయలతో నింపుతారు. ఇపుడు పోటీదారులు పండు మిరపకాయలను ఏడవకుండా తినాలి. అయితే ఈ పోటీలో విజేతగా నిలిచిన వ్యక్తి ఒక నిముషంలో 15 మిరపకాయలను తినగలిగాడు. ఇతనికి చిలీ కింగ్ పురస్కారాన్ని అందజేశారు.