శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (11:02 IST)

అల్జీరియాలో కుప్పకూలిన మిలటరీ విమానం.. 257 మంది సజీవదహనం

అల్జీరియాకు చెందిన మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతి చెందారు. అల్జీర్స్‌కి సమీపంలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి బెచార్ నగరానికి సమీపంలో 259 మందితో కూడిన ఇల్యుషిన్‌ 2–76 రవాణా విమా

అల్జీరియాకు చెందిన మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతి చెందారు. అల్జీర్స్‌కి సమీపంలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి బెచార్ నగరానికి సమీపంలో 259 మందితో కూడిన ఇల్యుషిన్‌ 2–76 రవాణా విమానం, టేకాఫ్‌ అయిన కాసేపటికే  పొలాల్లో కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో.. ప్రయాణీకుల్లో 257 మంది సజీవదహనమయ్యారు. ఇద్దరు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు.
 
విమానంలోని మృతులంతా ఆర్మీకి చెందిన వారు, వారి కుటుంబ సభ్యులేనని సహాయక సిబ్బంది ప్రకటించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు.. అధికారులు తెలిపారు. కానీ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
 
2014లో ఉక్రెయిన్‌ గగనతలంలో ప్రయాణిస్తున్న మలేషియా విమానాన్ని వేర్పాటువాదులు కూల్చిన దుర్ఘటనలో 298 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన భారీ విమాన ప్రమాదం ఇదేనని అధికారులు వెల్లడించారు.