శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 మార్చి 2018 (12:04 IST)

టర్కీ విమానం అలా కూలిపోయింది.. 11 మంది మహిళలు సజీవదహనం

ఇటీవల ఇరాన్‌కు చెందిన రెండు ఇంజిన్ల టర్బోప్రోప్ విమానం కూలిన ఘటనలో 65 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే.. టర్కీకి చెందిన ప్రైవేట్ జెట్ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మహిళలు సజీవ దహనం అయ్యారు.

ఇటీవల ఇరాన్‌కు చెందిన రెండు ఇంజిన్ల టర్బోప్రోప్ విమానం కూలిన ఘటనలో 65 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే.. టర్కీకి చెందిన ప్రైవేట్ జెట్ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మహిళలు సజీవ దహనం అయ్యారు. అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 370 కిలోమీటర్ల దూరంలోని షార్-ఇ-కోర్డ్ సమీపంలో ఓ పర్వతాన్ని విమానం ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఇరాన్ మీడియా ప్రకటించింది. కొండను ఢీకొనడంతో విమానంలో మంటలు చెలరేగాయని.. దీంతో పేలిన విమానంలో 11 మంది మహిళలు సజీవంగా దహనమైయ్యారని ఇరాన్ మీడియా తెలిపింది. 
 
ఇకపోతే.. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం విమానం షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన గంట తర్వాత ఈ ఈ ఘటన చోటుచేసుకుంది.