ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 మార్చి 2018 (09:54 IST)

స్టీవ్ హ్యారీ షో‌లో చిరంజీవి సాంగ్... ఉర్రూతలూగించిన 'సన్నాజాజాలా చుట్టేసిందిరో...' (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150". ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, వివి వినాయక్ దర్శకుడు. ఈ చిత్రం తమిళ చిత్రం కత్తికి రిమేక్. చిరంజీవి తనయుడు రాంచరణ్ నిర్మాత. అయితే, ఈ చిత

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150". ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, వివి వినాయక్ దర్శకుడు. ఈ చిత్రం తమిళ చిత్రం కత్తికి రిమేక్. చిరంజీవి తనయుడు రాంచరణ్ నిర్మాత. అయితే, ఈ చిత్రంలోని 'సన్నాజాజాలా చుట్టేసిందిరో...' పాట అమెరికన్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. 
 
స్టీవ్ హ్యారీషోలో ఈ తెలుగుపాటకు అక్కడి నృత్యకళాకారులు అద్భుతమైన రీతిలో డ్యాన్స్ చేయగా, చూస్తున్న ఆడియన్స్ మైమరచిపోయారు. వారి నృత్య ప్రతిభకు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాత, పలు చిత్రాలకు పీఆర్వోగా పని చేసిన బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడవచ్చు.