ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (16:45 IST)

ఈజిప్టులో బయల్పడిన 2వేల సంవత్సరాల నాటి మమ్మి.. బంగారు నాలుక

golden tongue
ఈజిప్టులో రెండు వేల సంవత్సరాల నాటి మమ్మి బయటపడింది. పురావస్తు తవ్వకాల్లో బయటపడిన ఈ మమ్మీలో బంగారు నాలుక వుండటం విశేషం. సాధారణంగా ఈజిప్టులో మమ్మీలు బయటపడటం సహాజమే. 
 
కానీ ఈసారి బయటపడిన మమ్మీ బంగారు నాలుకతో ఉంది. అది చూసి అధికారులు అవాక్కయ్యారు. దీంతో మమ్మీ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. ఈజిప్టులోని తపోరిస్‌ మగ్నా ప్రాంతంలో పురావస్తు పర్యాటక శాఖ అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ మమ్మీ బయటపడింది.
 
అయితే దాని నోటిలో బంగారు నాలుక ఉండటంతో శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన జరపగా ఇది 2వేల ఏళ్ల నాటిదిగా తేలింది. అయితే ఈ వ్యక్తి చనిపోయినప్పుడు అతడిని మమ్మీగా మార్చేందుకు ఈ బంగారు నాలుకను నోటీ మీద ఉంచి ఉంటారని, కాలక్రమేణా అది నోట్లోకి జారి ఉంటుందని పురావస్తు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.