శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మే 2022 (10:17 IST)

ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా ఆంటోనీ అల్బనీస్

Anthony Albanese
ఆస్ట్రేలియా కొత్త ప్రధానమంత్రిగా ఆంటోనీ అల్బనీస్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం ఆ దేశ రాజధాని కాన్‌బెర్రాలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఆంటోనీ ఆస్ట్రేలియా దేశ 31వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 
 
ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, ట్రెజరస్ జిమ్ చామర్స్, ఆర్థిక మంత్రి కాటీ గల్లాఘర్ కూడా బాధ్యతలు స్వీకరించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో మొత్తం 151 స్థానాలు ఉండగా, వీటికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు. 
 
ఈ ఫలితాల్లో మాజీ ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ నేతృత్వంలోని లిబరల్ నేషనల్ కూటమికి 51 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఆంటోనీ సారథ్యంలోని పార్టీ ఏకంగా 72 సీట్లను దక్కించుకుంది. కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సంపూర్ణ మెజార్టీ (76 సీట్లు)కి మరో నాలుగు సీట్లు కావాల్సి వచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో స్వతంత్రులుగా గెలుపొందిన వారు ఆంటోనీకి మద్దతు ప్రకటించడంతో ఆయన కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.