శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (09:33 IST)

పాకిస్థాన్‌లో దారుణం... గోధుమ కోసం కొట్టులాట.. 11మంది మృతి.. 60మంది గాయాలు

Pakistan
Pakistan
పాకిస్థాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కరువు కారణంగా జనాలు నానా తంటాలు పడుతున్నాయి. గోధుమ పిండితో వస్తున్న ట్రక్కుల కోసం ఎగబడుతున్నారు. తాజాగా, గోధుమ పిండిని దక్కించుకునే క్రమంలో పంజాబ్ ప్రావిన్స్‌లో 11మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
ప్రజలకు ఉచితంగా గోధుమ పిండిని అందించేందుకు పలు ప్రాంతాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండడంతోనే ఈ ఘటనలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు.  
 
తొక్కిసలాట ఘటనలపై స్పందించిన పంజాబ్ కేర్‌టేకర్ ముఖ్యమంత్రి మోసిన్ నక్వీ కీలక ప్రకటన చేశారు. రద్దీని తగ్గించేందుకు ఉదయం ఆరు గంటల నుంచే కేంద్రాలను తెరుస్తామని, ప్రావిన్స్ వ్యాప్తంగా ఉచిత పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.