ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (14:25 IST)

కొండచిలువ రోడ్డు దాటుతోంది.. ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా?

ఆస్ట్రేలియాలో కొండచిలువను కాపాడేందుకు ఓ యువకుడు సాహసం చేశాడు. కొండ చిలువ రోడ్డును దాటేందుకు జడుసుకుని నానా తంటాలు పడుతుంటే.. ఆ మార్గాన రోడ్డుపై తన స్నేహితులతో నడిచి వెళ్తున్న మాథ్యూ అనే యువకుడు ఆ పాము

ఆస్ట్రేలియాలో కొండచిలువను కాపాడేందుకు ఓ యువకుడు సాహసం చేశాడు. కొండ చిలువ రోడ్డును దాటేందుకు జడుసుకుని నానా తంటాలు పడుతుంటే.. ఆ మార్గాన రోడ్డుపై తన స్నేహితులతో నడిచి వెళ్తున్న మాథ్యూ అనే యువకుడు ఆ పామును రక్షించేందుకు రోడ్డుపై అడ్డంగా పడుకున్నాడు. ఆ పామును కాపాడేందుకు.. వాహనాలు దానిపై ఎక్కనీయకుండా రోడ్డుపై అడ్డంగా పడుకున్నాడు. 
 
రోడ్డుపై వాహనాలు వస్తాయనే భయం లేకుండా.. ఆ పాము సురక్షితంగా రోడ్డు దాటుకోవాలనే ఉద్దేశంతో పాముకు కాసింత దూరంలోనే పడుకున్న ఆ యువకుడిని చూసి అందరూ షాక్ తిన్నారు. పాము కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని ఆ యువకుడిని స్థానికులు కితాబిచ్చారు. 
 
ఈ పాము 2.5 మీటర్ల పొడవు వుంటుంది. ఈ పామును రోడ్డును దాటేందుకు పది నిమిషాలైంది. అప్పటిదాకా ఆ యువకుడు ఆ పాముకు రక్షగా నిలిచాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.