శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జూన్ 2020 (17:40 IST)

ఎగిరే విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..!

ఎగురుతున్న విమానంలో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మనీలాకు చెందిన ఓ మహిళ ముప్పై అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో మగబిడ్డను ప్రసవించింది.

వివరాల్లోకి వెళితే.. జూన్ 6న దుబాయ్‌ నుంచి మనీలాకు బయల్దేరిన ఫిలిప్పీన్స్ ఎయిర్ లైన్స్‌కు చెందిన పీఆర్659 విమానంలో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో విమాన సిబ్బంది ఈ విషయాన్ని ఎయిర్‌లైన్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు వెంటనే స్పందించి డాక్టర్‌ను సంప్రదించారు.
 
ఈ నేపథ్యంలో శాటిలైట్ ఫోన్ ద్వారా డాక్టర్ ఇచ్చిన సూచనల ప్రకారం విమానం సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి.. ఆ మహిళకు కాన్పు చేశారు. కాగా.. 30వేల అడుగుల ఎత్తులో పుట్టిన శిశువుకు స్వాగతం పలికిన విమాన సిబ్బంది.. ఆ క్షణాలను సెలబ్రేట్ చేసుకున్నారు. పుట్టిన శిశువుతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.