బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (12:57 IST)

వలస కార్మికులకు దేవుడు.. రైళ్లు, బస్సులు కాదు.. ఫ్లైట్ బుక్ చేశాడు..

కరోనా మహమ్మారి కారణంగా రోడ్డున పడిన వలస కార్మికులను ఆదుకునేందుకు నటుడు సోనూసూద్ ముందుకు వచ్చారు. దీంతో వలస కార్మికులకు ఆయన దేవుడిగా కనిపించారు. ఇప్పటికే బస్సులు, రైళ్ల ద్వారా స్వస్థలాలకు కార్మికులు చేరుకున్నారు. ఇటీవల కొచ్చి నుండి భువనేశ్వర్‌కి ప్రత్యేక ఫ్లైట్ ద్వారా దాదాపు 150 మందిని సొంత గూటికి చేర్చారు. 
 
తాజాగా మరో ఫ్లైట్‌ను సోనూ బుక్ చేశారు. తాజాగా ముంబై నుండి ఉత్తారాఖండ్‌లోని డెహ్రాడూన్‌కి వెళ్ళేందుకు ఎయిర్ ఏషియాకి చెందిన విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లైట్‌లో 173 మంది వలస కార్మికులని వారి ప్రాంతానికి పంపారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టాలలో ఉన్న వారికి అండగా ఉండడం తనకి సంతోషంగా వుందన్నారు. వలస కార్మికులలో చాలా మందికి ఎప్పుడూ విమాన ప్రయాణం చేసే అవకాశం రాలేదని తెలిపారు.
 
వారి కుటుంబాలని, స్నేహితులని కలుసుకునేందుకు ఎయిర్ ఏషియా ఇండియా విమానంలో ప్రయాణించినప్పుడు వారి ముఖాల్లో చిరునవ్వులు చూస్తుంటే ఎంతో ఆనందాన్ని ఇచ్చాయన్నారు. వలస కార్మికుల కోసం భవిష్యత్తులో మరిన్ని విమానాలను ఏర్పాటు చేయనున్నట్లు సోను సూద్ వెల్లడించారు.