మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 30 మే 2020 (21:08 IST)

శభాష్ సోనూసూద్, మహారాష్ట్ర గవర్నర్ ప్రశంసలు

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్‌తో వలస కార్మికులు తీవ్ర ఇక్కట్లు పాలయ్యారు. తినేందుకు తిండి లేక తాగేందుకు నీరు లేక నానా అగచాట్లు పడుతున్నారు. కనీసం వారివారి ఇళ్లకు వెళ్దామంటే ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ఎక్కడివారు అక్కడే ఆకలితో అలమటిస్తున్నారు.
 
ఇలాంటివారిని పెద్దమనసు గల సెలబ్రిటీలు ఆదుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో జగపతి బాబు, చిరంజీవి తదితర హీరోలు తమవంతు సాయం చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే... నటుడు సోను సూద్ వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారివారి గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన ఈరోజు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని ముంబైలోని రాజ్ భవన్‌లో కలిశారు. వలస వచ్చిన ప్రజలు తమ సొంత రాష్ట్రాలకు చేరుకోవడానికి, వారికి ఆహారాన్ని అందించడానికి తను చేస్తున్న సహాయ కార్యక్రమాల గురించి గవర్నర్‌కు వివరించారు. సోను సూద్ చేస్తున్న సహాయకార్యక్రమాలపై గవర్నర్ ప్రశంసలు కురిపించారు. సోనూసూద్ చేస్తున్న ప్రయత్నాలకు తమ పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.