1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 మే 2020 (17:06 IST)

డేటింగ్ వార్తను చూసి మేమిద్దరం నవ్వుకునేవాళ్లం : సోనాక్షి సిన్హా

బాలీవుడ్ హీరోయిన్లలో సోనాక్షి సిన్హా. ఆమె బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో ప్రేమలో పడటమే కాదు ఏకంగా డేటింగ్ కూడా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై బాలీవుడ్ సైతం కోడై కూసింది. కానీ ఈ హీరో, హీరోయిన్ మాత్రం ఎక్కడా పెదవి విప్పలేదు. అయితే, కరోనా లాక్డౌన్ వేళ సినీ సెలెబ్రిటీలంతా తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. కానీ, సోషల్ మీడియాలో నెటిజన్లు, తమ ఫ్యాన్స్ అడిగే కొంటే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ టైంపాస్ చేస్తున్నారు.
 
తాజాగా సోనాక్షి సిన్హా కూడా తన ప్రేమ వ్యవహారం, షాహిద్ కపూర్‌తో డేటింగ్ వ్యవహారంపై స్పందించింది. షాహిద్‌తో డేటింగ్ నిజం కాదని, అతను తనకు మంచి స్నేహితుడని సొనాక్షి చెప్పింది. 'ఖాళీగా ఉండే కొందరు వ్యక్తులు ఇలాంటి రూమర్లను కావాలని సృష్టిస్తారేమో. వాటిని అందరూ చాలా తొందరగా నమ్మేస్తారు. పెళ్లి కాని ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నప్పుడు వారిని టార్గెట్ చేసుకుని ఇలాంటి రూమర్లు అల్లేస్తారు. ఇలాంటివి నన్నెప్పుడూ బాధించలేదు. ఆ వార్తలు చూసి నేను, షాహిద్ నవ్వుకునే వాళ్లం. మేమిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులమేన' మని సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. 
 
కాగా, వీరిద్దరూ గత 2013లో వచ్చిన ఆర్... రాజ్‌కుమార్ అనే చిత్రంలో జంటగా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలోపడి, డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే 2015లో షాహిద్.. మీరా రాజ్‌పుత్‌ని వివాహం చేసుకున్నాడు. దీంతో ఆ డేటింగ్ వార్తలకు చెక్ పడింది. ఈ పుకార్లపై సోనాక్షి సిన్హా ఇపుడు పెదవివిప్పారు.