శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (19:48 IST)

అత్తమ్మ కోసం అమెరికా వెళ్లాం.. త్వరలో భారత్‌కు వచ్చేస్తాం.. సన్నీ

అమెరికాకు వెళ్లిన బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ మళ్లీ భారత్‌కు వచ్చేస్తానని చెప్తోంది. భర్త డేనియల్ కుటుంబ సభ్యులు అమెరికాలో వుంటున్నారని.. అత్తమ్మగారు వయస్సులో పెద్దవారు.. ఆమెకు తమ అవసరం ఎంతో వుందని సన్నీ చెప్పుకొచ్చింది.

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే తాను అమెరికా వెళ్లానని వెల్లడించింది. పరిస్థితులన్నీ సర్దుకున్నాక.. అంతర్జాతీయ విమాన  రాకపోకలకు అనుమతులు వచ్చిన వెంటనే భారత్‌కు వచ్చేస్తామని సన్నీ వివరించింది. 
 
కాగా... కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో తన భర్త డేనియల్‌ వెబర్‌, పిల్లలతో కలిసి సన్నీ అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు.

తాజాగా సన్నీ ఓ పత్రికతో ముచ్చటించారు. డేనియల్‌ కుటుంబ సభ్యుల కోసమే తాము ఇండియా నుంచి అమెరికా వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు ముంబయి వదిలిరావడం వ్యక్తిగతంగా తనకెంతో బాధ కలిగించింది. చాలా రోజులపాటు ఆలోచించిన తర్వాతే తాను ముంబై వదిలి అమెరికా వెళ్లానని సన్నీ వెల్లడించింది.