శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (12:47 IST)

శిశువును ప్లాస్టిక్ పేపర్లో చుట్టి కొరియర్ చేసింది: పార్శిల్ కదిలింది.. ఏడుపు శబ్ధం వినిపించడంతో?

ముక్కుపచ్చరాలని శిశువును ఓ ప్లాస్టిక్ పేపర్లో చుట్టి పార్సెల్ చేసి ఓ మహిళ కొరియర్ ద్వారా ఓ అనాధ ఆశ్రమానికి పంపించిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఏమాత్రం కనికరం లేకుండా శిశువు కొరియర్లో అనాధాశ్రామానికి పం

ముక్కుపచ్చరాలని శిశువును ఓ ప్లాస్టిక్ పేపర్లో చుట్టి పార్సెల్ చేసి ఓ మహిళ కొరియర్ ద్వారా ఓ అనాధ ఆశ్రమానికి పంపించిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఏమాత్రం కనికరం లేకుండా శిశువు కొరియర్లో అనాధాశ్రామానికి పంపడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని దాదా అనే ప్రాంతంలో ఓ కొరియర్ సంస్థకు ఓ పార్శిల్ వచ్చింది. అందులో ఓ అనాధ ఆశ్రమానికి సంబంధించిన చిరునామా వుంది. 
 
ఆ పార్శిల్‌ను ఇచ్చేందుకు కొరియర్ బాయ్ వెళ్తున్న సమయంలో ఆ పార్శిల్ నుంచి కదలికలు మొదలయ్యాయి. శిశువు ఏడ్చే శబ్ధం వినిపించింది. వెంటనే కొరియర్ బాయ్ ఆ పార్శిల్‌ను తెరచి చూశాడు. అందులో ముక్కుపచ్చలారని శిశువు వుండటం చూసి షాక్ అయ్యాడు. ఆపై స్థానికుల సహకారంతో పోలీసులకు కొరియర్ బాయ్ సమాచారం ఇచ్చాడు.
 
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శిశువును పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత ఆ శిశువు కన్నతల్లిని పోలీసులు కనుగొన్నారు. ఆమె పేరు లువోనని తెలిసింది. ఆమెను శిశువును వచ్చి తీసుకెళ్లాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా చైనాలో శిశువు వధించే వారికి ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తారు.