గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (09:35 IST)

మినిట్‌మ్యాన్-3ని పరీక్షించిన అమెరికా - 30 నిమిషాల్లో...

Minuteman ICBM Launch
Minuteman ICBM Launch
మినిట్‌మ్యాన్-3 అనే ఈ సూపర్‌సోనిక్ మిసైల్‌ని అమెరికా పరీక్షించింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) అయిన ఈ మిసైల్‌ను కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి అమెరికా రక్షణ దళాలు ప్రయోగించాయి. 
 
ఎలాంటి వార్ హెడ్ లేకుండా ప్రయోగించిన ఈ క్షిపణి పసిఫిక్ మహాసముద్రం మీదుగా నార్త్ పసిఫిక్‌లోని క్వాజలీన్ అటోల్ దిశగా 4,000 మైళ్లకు పైగా దూరం ప్రయాణించింది. 
 
గంటకు 15,000 మైళ్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లింది. భూమి మీద ఏ మూలన ఉన్న లక్ష్యాన్నైనా 30 నిమిషాల్లో చేధించగల సత్తా ఈ క్షిపణికి ఉంది. ఈ పరీక్షను కొన్ని సంవత్సరాల క్రితమే ప్లాన్ చేశామని అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు.