1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జనవరి 2024 (14:57 IST)

అమెరికా మిలటరీ బే స్పైలో ఫ్లయింగ్ సాసర్

us-military-base
ప్రపంచవ్యాప్తంగా అటు శాస్త్రవేత్తలకు, ఇటు సామాన్యులకు అత్యంత ఆసక్తి కలిగించే ఫ్లయింగ్ సాసర్ (ఎగిరే పళ్లెం) తాజాగా మరోమారు కెమెరా కంటింకి చిక్కింది. అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్ వో)గా వ్యవహరించే ఇవి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సవాలుగానే మిగిలిపోయాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా మిలటరీ బే స్పై మరోసారి ఇది కనిపించి కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. 
 
జెల్ఫీఫిష్ ఆకారంలో ఎగురుతున్నట్టుగా ఉన్న ఈ వీడియోను తొలుత ఆర్టిస్ట్, ఫిల్మ్ మేకర్ జెరెమీ కార్బెల్ ఇన్‌స్టాగ్రామ్‍‌లో షేర్ చేశారు. ఆ వెంటనే అది ట్విట్టర్ ఖాతాలో చేరింది. బ్లాక్ అండ్ వైట్లో ఉందీ వీడియో క్లిప్. ఇరాక్‌లోని జాయింట్ అమెరికా బేస్పై తిరుగుతున్న ఎగిరేపళ్లెం నెటిజన్లలో ఉత్సుకత పెంచింది.
 
తాజా వీడియో విషయానికి వస్తే ఆ యూఎఫ్ ఓ సరస్సులో మునిగి 17 నిమిషాల తర్వాత 45 డిగ్రీల కోణంతో తిరిగి పైకి లేచి వేగంగా ఆకాశంవైపు దూసుకెళ్లనట్టు కార్బెల్ పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు అది ఫ్లైయింగ్ సాసరేనన్న వాదనతో ఏకీభవిస్తే, మరికొందరు మాత్రం అదంతా ఒట్టిదేనని కొట్టిపడేస్తున్నారు. అది కెమెరా లెన్స్‌పై పడిన మరక తప్ప మరోటి కాదని, తమను ఫూల్స్న చేయొద్దని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ వీడియోను షేర్ చేసిన కార్బెల్ దీనిని చొరబాటుగా అభివర్ణించారు. నెటిజన్లు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది 2018లో జరిగిందని, అక్కడి సైనిక సిబ్బంది దీనిని రికార్డు చేశారని చెబుతున్నారు. మియామీలో ఓ మాల్ వెలుపల 10 అడుగుల గ్రహాంతరవాసి కనిపించినట్టు వైరల్ అయిన వీడియోపై పోలీసులు స్పందించిన వారంలోనే ఇప్పుడీ వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది.