శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 28 నవంబరు 2019 (08:21 IST)

లోయలో పడ్డ బస్సు – 16 మంది దుర్మరణం

నేపాల్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. లోయలో బస్సు పడి 16 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. అర్ఘాఖాంచీ జిల్లా మీదుగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ 500 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది.

సంధికాక్ నుంచి భూటాన్ వెళ్తున్న బస్సు బుధవారం  మధ్యాహ్నం నార్పానీ ప్రాంతంలో అదుపు తప్పి లోయలో పడింది. మూల మలుపు తిరిగే సమయంలో డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు నేపాల్ పోలీసులు తెలిపారు.

బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని అన్నారు. ఈ ప్రమాదంలో మరో 10 మంది గాయపడ్డారు.. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని హాస్పటల్స్ కు తరలించారు.