శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (12:30 IST)

చైనాలో కరోనా మృతులు.. 40 వేలకు పైమాటే.. వుహాన్ ప్రజలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పురుడు పోసుకున్న నగరం వుహాన్. చైనాలో ఉంది. ఈ వైరస్ దెబ్బకు తొలుత వణికిపోయిన దేశ చైనానే. ముఖ్యంగా, వుహాన్, హుబేయ్ ప్రానిన్స్‌లను వణికించిన ఈ వైరస్.. ఇపుడు ప్రపంచాన్ని కబళించింది. ఇప్పటికే 7 లక్షల మందికి ఈ వైరస్ సోకింది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 23 వేల మంది ప్రాణాలను తీసింది. 
 
అయితే, ఈ వైరస్ పురుడు పోసుకున్న చైనా నగరంలో మృతుల సంఖ్య 3,300 అని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించగా, ఇక్కడి మరణాల సంఖ్య 42 వేలకు పైనేనని వూహాన్ ప్రజలు అంటున్నారు. దీనికి సాక్ష్యాధారాలను కూడా వారు చూపుతున్నారు. ఎందుకంటే... గత నెల రోజుల వ్యవధిలో 28 వేల మృతదేహాలను దహనం చేశారని, మృతుల లెక్కపై సమగ్ర దర్యాప్తే లేదని, లెక్కకు మించి జనం వారి ఇళ్లలోనే మరణించారని అంటున్నారు. 
 
ముఖ్యంగా, చైనా ప్రభుత్వ అధికారులు వెల్లడించిన గణాంకాలతో పోలిస్తే, మృతుల సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ప్రతిరోజూ 500 ఆస్తి కలశాలను మృతుల బంధువులకు అందిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. వచ్చే 12 రోజుల్లో అస్తికలు కలశాల పంపిణీ పూర్తవతుందని, అందరు మృతుల అస్తులనూ వారి బంధువులకు పంచుతామని అధికారులు అంటున్నారని ఇక్కడి ప్రజలు వెల్లడించారు. కాగా, మొదటి నుంచి చైనాలో సంభవించిన మరణాల సంఖ్యపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్న విషయం తెల్సిందే.