శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (20:42 IST)

యుద్ధానికి సిద్ధంగా వుండండి మై సోల్డియర్స్: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

చైనాకు ఇటీవలి కాలంలో ఏమయిందో తెలియదు కానీ పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలు ఇలాగే వున్నాయి. 
 
తాజాగా జిన్ పింగ్ చైనాలోని గ్యాంగ్‌డాంగ్ ప్రావిన్సులో వున్న మిలటరీ బేస్‌ను సందర్శించిన సందర్భంలో నావికా దళాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ... మీరందరూ యుద్ధానికి సిద్ధంగా వుండాలంటూ పిలుపునిచ్చారు.

ఈ మేరకు చైనా అధికారిక వార్తా సంస్థ అయిన షినువా ఓ కథనాన్ని ప్రచురించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారతదేశ వాస్తవాధీన రేఖ వెంబడి దుందుడుకు చర్యలతో కవ్వింపులకు పాల్పడుతోంది. తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరింత ఉద్రిక్త వాతావరణం కలిగే అవకాశం లేకపోలేదు.
 
ఇప్పటికే దక్షిణ చైనా సముద్రం, ఇండో-పసిఫిక్ జలాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై భారత్ సహా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఆగ్రహంతో వున్నాయి. కానీ అవేవీ చైనాకు పట్టినట్లు లేదు. శాంతిమంత్రం అంటూనే భారత ఉత్తర సరిహద్దుల్లో చైనా 60 వేల మంది సైనికులను మోహరించింది. దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.