మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (16:16 IST)

చైనాలో విషాదం.. గాల్లో నుంచి కిందపడి మహిళ మృతి

mid sir stunt
చైనా సెంట్రల్ ‌అన్‌హువై ప్రావిన్స్‌లోని సుజోవు నగరంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఇందులో ఓ మహిళ తన భర్తతో కలిసి గాల్లో విన్యాసం చేస్తూ అదుపుతప్పి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ ప్రదర్శనను తిలకిస్తున్న వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
సుజోవు నగరంలో ఓ జిమ్నాస్టిక్ ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఇందులో సన్ అనే మహిళ తన భర్తతో కలిసి విన్యాసాలు మొదలుపెట్టారు. అయితే, ప్రదర్శనలో భాగంగా ఓ భారీ క్రేన్ సాయంతో ఇద్దరినీ పైకి లేపారు. క్రేన్‌కు ఉన్న రెండు బెల్టులను భర్త పట్టుకోగా, అతడి చేతులను పట్టుకుని గాల్లోనే ఆమె విన్యాసాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో భర్త కాళ్లను పట్టుకొని పీట్ మార్చేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో పట్టు కోల్పోయిన ఆ మహిళ ఒక్కసారిగా కిందపడిపోయింది. 
 
ఆమెను పట్టుకునేందుకు భర్త చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆమె చాలా ఎత్తు నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రదర్శన తిలకిస్తున్న వారంతా ఒక్కరాసా భయభ్రాంతులకు గురయ్యారు. గాయాలపాలైన ఆ మహిళను నిర్వాహకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఆమెను రక్షించుకోలేక పోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోలు చైనా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.