శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (09:36 IST)

విపరీతమైన దగ్గుకారణంగా విరిగిన ఛాతి ఎముక.. ఎక్కడ?

ribs
చైనాకు చెందిన ఓ మహిళకు దగ్గితేనే ఛాతి ఎముకలు విరిగిపోయాయి. ఘాటైన ఆహారం తీసుకోవడంతో ఒక్కసారిగా విపరీతమైన దగ్గు వచ్చింది. ఈ దగ్గు కారణంగా ఛాతి ఎముకలు విరిగిపోయాయి. ఎముకలకు ఆధారంగా ఉండే కండరం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు అంటున్నారు. 
 
షాంగై నగారనికి చెందిన హువాంగ్ అనే మహిళ ఇటీవల కాస్తంత ఘాటైన ఆహారం తీసుకుది. దీంతో ఆమెను దగ్గు ముంచెత్తింది. దగ్గుతున్న సమయంలో ఛాతి నుంచి నొప్పి వచ్చింది. తొలుత పట్టించుకోలేదు. అయితే, ఆ తర్వాత ఛాతిలో నొప్పిగా అనిపించడంతో వైద్యులను సంప్రదించింది. 
 
ఆమెకు స్కానింగ్ చేసిన వైద్యులు ఛాతిలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే, దగ్గితేనే ఆమె ఛాతిలోని పక్కటెముకలు విరిగిపోయాయన్నదానికి కారణం చెప్పారు. ఆమె ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉండటం వల్ల శరీరంలో ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఎదగలేదని చెప్పారు. దీంతో ఆమె దగ్గినపుడు అవి విరిగిపోయాయని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారని, కోలుకున్న తర్వాత వ్యాయాయం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా కండరాలు పెంచుకోవచ్చని తెలిపారు.