శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (09:37 IST)

కరోనా వైరస్ పురుడు పోసుకుంది వూహాన్ ల్యాబ్‌లోనే...

wuhan lab covid
ప్రపంచానికి అన్ని విధాలుగా అపార నష్టం కలిగించిన కరోనా వైరస్ పురుడు పోసుకుంది చైనాలో వూహాన్ నగరంలోనే అని అమెరికా శాస్త్రవేత్త ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పరిశోధకుడు ఆండ్రూ హాఫ్ తాజాగా "ది ట్రూత్ ఎబౌట్ వుహాన్" అనే పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఇందులో కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలను వివరించారు. 
 
వూహాన్ పరిశోధనాశాల నుంచే కోవిడ్ వైరస్ లీకైందని తెలిపారు. ఆ ల్యాబ్‌లో తగిన భద్రతా ప్రమాణాలు లేవని, నిర్వహణ లోపం కూడా ఉందని ఆయన పేర్కొన్నాడు. అయితే, చైనాలో కరోనా తరహా ప్రమాకర వైరస్‌లో అభివృద్ధికి అగ్రరాజ్యం అమెరికా కూడా నిధులు సమకూర్చి తన వంతు పాత్ర పోషించిందని తెలిపారు. కోవిడ్ వైరస్‌ను జన్యుపరంగా మార్పులు చేసి అభివృద్ధి చేసిన విషయం చైనా, అమెరికాలకు బాగానే తెలుసన్నారు. 
 
ఆండ్రూ హఫ్ ఎకోహెల్త్ అలయన్స్‌ అనే పరిశోధక సంస్థ గతంలో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఈ సంస్థ వూహాన్ ల్యాబ్‌కు పలు పరిశోధనల్లో సహకారం అందించారు. ఈ మేరకు ఆండ్రూ హాఫ్‌ను ఉటంకిస్తూ పాశ్చాత్య మీడియాలో పలు కథనాలు వచ్చాయి. మొత్తం మీద కరోనా పురుడు పోసుకందని చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ బలంగా నమ్ముతుంటే చైనా మాత్రం అలాంటిదేమీ లేదని బుకాయిస్తుంది.