సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (09:49 IST)

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా పాజిటివ్

coronavirus
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, ఇంటి వద్ద తన పనులలతో బిజీగా గడుపుతున్నట్టు పేర్కొన్నారు.
 
అదేసమయంలో కరోనా వ్యాక్సిన్, బూస్టర్ డోస్ వేసుకోవడం వల్ల కరోనా తీవ్ర తక్కువగా ఉందని చెప్పారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్, బూస్టర్ డోస్‌లు వేయించుకోవాలని కోరారు. ఇపుడు శీతాకాలంలోకి ప్రవేశించినందు వల్ల ఈ వ్యాక్సిన్ చాలా ముఖ్యమని, అలాగే, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. 
 
మరోవైపు, భారత్ వంటి పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. కానీ, చైనాలో ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా ఉంది. దీంతో అక్కడ లాక్డౌన్ అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికాలో కూడా ఈ కేసులో ఇంకా నమోదవుతూనే ఉన్నాయి.