1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (17:49 IST)

బర్డ్ ఫ్లూ.. 3.10 లక్షల కోళ్లను చంపేయాలని ఆదేశం

Hen
Hen
జపాన్‌లో సుదీర్ఘ విరామం తర్వాత, బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో మూడు లక్షలకు పైగా కోళ్లను నాశనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు జపాన్‌లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. దీంతో దేశ ఆరోగ్య శాఖ పలు చర్యలు తీసుకుంటోంది. 
 
ఈ పరిస్థితిలో బర్డ్ ఫ్లూ ఇతర కోళ్లకు వ్యాపించకుండా దాదాపు 3 లక్షల 10 వేల కోళ్లను చంపేయాలని జపాన్ ప్రభుత్వం ఆదేశించింది. 
 
అక్టోబరు నుంచి బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోందని, దీనిని నివారించడానికి ఇప్పటివరకు మొత్తం 33 లక్షల కోళ్లను చంపినట్లు సమాచారం.