శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (12:27 IST)

ఎండల్లో కరోనా వైరస్ మాడిపోతుందట.. నేను చెప్తే విన్నారా? ట్రంప్

Summer
ఎండల్లో కరోనా వైరస్ మాడిపోతుందని.. బలహీనపడుతుందని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లోని సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టరేట్ తాత్కాలిక అధిపతి విలియం బ్రయాన్ తెలిపారు. సూటిగా పడే సూర్యకాంతిలో వైరస్ సత్వరమే చనిపోతుందని ఆయన వైట్‌హౌస్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఇళ్లల్లో, అదీ పొడి వాతావరణంలో వైరస్ బాగా బతుకుతుందని, ఉష్ణోగ్రతలు పెరిగి తేమశాతం ఇనుమడిస్తే, ఇంకా చెప్పాలంటే నేరుగా సూర్యకాంతికి గురైతే అది బలహీనపడుతుందని అమెరికా పరిశోధకులు అంటున్నారని బ్రయాన్ తెలిపారు.
 
అయితే సింగపూర్ వంటి వెచ్చటి ప్రాంతాల్లోనూ వైరస్ వ్యాపించడం చూస్తే ఇది ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించే అధ్యయనం కాదని తెలుసుకోవచ్చు. ఈ ఫలితాలను ఆచితూచి స్వీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వేసవిలో వైరస్ తగ్గుముఖం పట్టవచ్చని తాను ఇదివరకు చెప్పిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ''వేడిమి, సూర్యకాంతితో వైరస్ పోతుందని నేను అంటే చాలామందికి అది నచ్చలేదు' అని ట్రంప్ అన్నారు.