బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మే 2020 (23:50 IST)

పాకిస్థాన్‌లో ఒక్క రోజే 1,083 కేసులు.. ఏడాదిలోపు వ్యాక్సిన్

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో సోమవారం ఒక్క రోజులోనే 1,083 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 20,186కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 22 మంది చనిపోగా.. మొత్తం మృ తులు 462కు పెరిగాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,590 మంది రోగులు కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిపింది. 
 
ఇదిలా ఉంటే.. అగ్రరాజ్యం అమెరికా కరోనాతో విలవిల్లాడిపోతుంది. అమెరికాలో 11 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 67 వేలకు పైగా మృతిచెందారు. ఇలాంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ కరోనా మరణాల సంఖ్య లక్ష వరకు ఉంటుందని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమైనాయి. కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఈ ఏడాది లోపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.