సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (13:13 IST)

కరోనాను అంతమొందించే వ్యాక్సిన్స్... నవంబర్ 1నాటికి సిద్ధం..?

కరోనా వైరస్ అంతమొందించే వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్రరాజ్యం అమెరికా వ్యాక్సిన్‌ పంపిణీలో కీలక ముందడుగు వేసినట్టు కనబడుతోంది. నవంబర్‌-1 నాటికి సమర్థవంతమైన కొవిడ్‌ టీకాను ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధం కావాలంటూ రాష్ట్రాలకు సమాచారం ఇచ్చినట్టు అమెరికా మీడియా చెప్తోంది.
 
వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు అవసరమైన వసతులపై దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ గత నెల 27న సీడీసీ డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ రాసిన లేఖలో పేర్కొన్నట్టు వాల్‌స్ట్రీట్‌జర్నల్‌ పేర్కొంది. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందే వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ తుది ఆమోదానికి చేరువలో ఉందంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.