గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (15:50 IST)

కరోనా ఎండమిక్.. ప్రపంచం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే కబురు

ఎండెమిక్ అంటే స్థానికంగా ఉండే అంటు వ్యాధి అని అర్థం. కరోనా ఎండమిక్ అంటే ఇక ప్రపంచం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే కబురే వచ్చిందని చెప్పాలి. 
 
వివరాల్లోకి వెళితే..  లాన్సెట్ మెడికల్ జర్నల్ పత్రిక కరోనా ఎండెమిక్‌గా మారినట్లు తెలిపింది. తన సంపాదకీయంలో ఈ విషయాన్ని ప్రచురించింది. 
 
వైద్య రంగంలో విశ్వసనీయ పత్రికగా పేరొందిన లాన్సెట్ కరోనా ఎండెమిక్ స్జేజీకి వచ్చిందని పేర్కొనడం జనాలకు మంచి కబురు చెప్పినట్లు అయ్యింది. 
 
కరోనా ఒక మహమ్మారిగా విరుచుకుపడే శక్తిని కోల్పోయినట్టు. స్వల్ప స్థాయిలో అనారోగ్యానికి గురి చేసే శక్తి మాత్రమే ఉంటుంది. కరోనా ఎండెమిక్ అయినప్పటికీ, అది ఎప్పటికీ మనతోనే ఉంటుందని లాన్సెట్ తెలిపింది. 
 
ఎక్కువ మంది ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే శక్తి ఏర్పడినట్టు లాన్సెట్ అంచనా వేసింది. కరోనా కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడాన్ని గుర్తు చేసింది.