శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2019 (14:23 IST)

వజ్రంలో వజ్రం.. కనీవినీ ఎరుగని వింత

వజ్రాల చరిత్రలో కనీవినీ ఎరుగని వింత చోటుచేసుకుంది. వజ్రంలో వజ్రం ఉన్న అరుదైన రత్నాన్ని తవ్వకాల్లో కనుగొన్నారు.

రష్యాలోని అల్రోసా పీజేఎస్‌సీ మైనింగ్ కంపెనీ తవ్వకాల్లో ఇది లభ్యమైంది. సుమారు 800 మిలియన్ సంవత్సరాల క్రితానికి చెందినదని అంటున్నారు. వజ్రం బరువు 0.62 క్యారెట్లు. లోపలున్న దాని బరువు 0.02 క్యారెట్లు. చరిత్రలో ఇలాంటి వజ్రం గురించి ఎప్పుడూ వినలేదని కంపెనీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

ప్రకృతిలో సహజసిద్ధంగా ఏర్పడిన వింతగా దీన్ని అభివర్ణిస్తున్నారు. శూన్యాన్ని ప్రకృతి ఇష్టపడదని... ఎలాంటి రంధ్రం లేకపోయినా.. సహజంగానే ఈ విధంగా ఏర్పడిందని అంటున్నారు.
 
సైబీరియా ప్రాంతంలోని న్యూర్బా గనుల్లో ఈ అరుదైన వజ్రం లభ్యమైంది. ఇక్కడ వింత ఏంటంటే.. లోపలున్న చిన్న వజ్రానికి.. పెద్ద వజ్రానికి మధ్య ఖాళీ ఎలా ఏర్పడిందనేది పరిశోధకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

తమకు దొరికిన వెంటనే సదరు కంపెనీ దీన్ని పరిశోధనల కోసం పంపించింది. తదుపరి పరిశోధనలకు ఆ వజ్రాన్ని అమెరికా కూడా పంపనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.