మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (09:36 IST)

దుబాయ్ టు భారత్... అండర్ వాటర్ హైస్పీడ్ రైలు.. నిజమా?

అరబ్ దేశాల్లో ఒకటైన దుబాయ్ - భారత్‌లో మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇటీవలి కాలంలో మరింతగా బలపడ్డాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి భారత్‌కు రైలు మార్గం ఏర్పాటుకానుంది. అదీకూడా సముద్ర భూగర్భంలో ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ అండర్ వాటర్ హైస్పీడ్ రైలు మార్గం పూర్తయితే చరిత్రపుటలకెక్కనుంది. 
 
దుబాయ్‌లోని ఫుజురాయ్ నుంచి భారత్‌లోని ముంబై వరకు ఈ మార్గాన్ని నిర్మిస్తారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 2 వేల కిలోమీటర్ల వరకు దూరం ఉంది. ఇంతదూరం సముద్రగర్భంలోనే రైలు మార్గం నిర్మించి, ఈ మార్గంలో అండర్ వాటర్ హైస్పీడ్ రైలును నడుపనున్నారు. 
 
ఈ మేరకు యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజరీ బ్యూరో కంపెనీ వెల్లడించింది. ఈ విషయాన్ని సదరు కంపెనీ ఎండీ అబ్దుల్లా అల్‌షేహీ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలోపేతం అయ్యేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేయనుందని.. వర్తకం మరింత అభివృద్ది చెందుతుందని అబ్దుల్లా చెప్పారు. 
 
వీటివల్ల ప్రజల అవసరాలతో పాటు ఇరు దేశాల ఎగుమతులు దిగుమతులకు ఈ రైలు మార్గం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే ఇటువంటి రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా, జపాన్‌లు చూస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.