సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (09:14 IST)

నేపాల్‌లో భారీ భూకంపం: 69 మంది మృతి, పలువురికి గాయాలు

earthquake
నేపాల్‌లో భారీ భూకంపం ఏర్పడింది. శుక్రవారం అర్ధరాత్రి పశ్చిమ నేపాల్‌లో 5.6-తీవ్రతతో కూడిన భూకంపం సంభవించడంతో దాదాపు 69 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు అధికారులు తెలిపారు.
 
పశ్చిమ జాజర్‌కోట్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2:02 గంటలకు ఈ భూకంపం ఏర్పడింది. 18 కి.మీ లోతుతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వేను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. 
 
భూకంపం కారణంగా రుకుమ్ జిల్లాలో 35 మంది, పొరుగున ఉన్న జాజర్‌కోట్ జిల్లాలో 34 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. 
 
తక్షణమే రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్‌లకు ఆదేశించారు. కాగా 2015లో ఇదే తరహా భూకంపం ఏర్పడింది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 9,000 మంది మరణించారు. పర్వత దేశంలోని అర మిలియన్లకు పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి.