గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (18:51 IST)

ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఈశాన్యంగా భూకంప కేంద్రం

earthquake
గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. సోమవారం కూడా మరో భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. సోమవారం ఉదయం 9.11 గంటల ప్రాంతంలో ఈ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంచించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైనట్టు జాతీయ భూకంపాల నమోదు కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ) వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం పితోర్‌ఘర్‌కు ఈశాన్యంగా 48 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 
 
కాగా, ఇటీవలే నేపాల్‌‍లో 6.2 తీవ్రవతో భారీ భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో వరుసగా భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆదివారం కూడా దేశ రాజధాని ఢిల్లీ, ఎన్.సి.ఆర్ రీజియన్‌లో భూప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెల్సిందే.