సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2023 (11:54 IST)

వికీపీడియా పేరు మార్చితే డబ్బులిస్తా : ఎలాన్ మస్క్

elon musk
వికీ పీడియా పేరు మార్చితే డబ్బులిస్తానని ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఒక ఘోర షరతు విధించారు. విరాళాలకు సంబంధించిన సందేశాన్ని షేర్ చేస్తూ.. 'వికీపీడియా పేరును (రాయటానికి వీలులేని ఓ బూతు పేరుగా) మారిస్తే .. వారికి నేను బిలియన్ డాలర్లు ఇస్తాను అని మస్క్ ట్వీట్ చేశారు. గురకపెడుతున్న ఎమోజీని షేర్ చేశారు. 
 
అలాగే వికీపీడియా ఎందుకు డబ్బులు అడుగుతోందని ప్రశ్నించారు. ‘వికీమీడియా ఫౌండేషన్‌కు అంతడబ్బు అవసరం ఏముందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? వికీ నిర్వహణకు అంతడబ్బు అవసరం లేదు. మరి దేనికోసం ఆ సొమ్ము అడుగుతున్నారు..?' అని మస్క్ ప్రశ్నించారు. ఇదీ చదవండి: 15 ఏళ్లలో కోటి సమకూర్చుకోవడం ఎలా?
 
ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంతమంది 'ఆ డబ్బు అందిన వెంటనే తిరిగి పేరు మార్చుకోవచ్చు కదా..?' అని సలహా ఇచ్చారు. దానికి మస్క్ బదులిస్తూ.. నేనేమైనా పూల్నా.. కనీసం ఒక ఏడాది ఆ పేరు ఉండాలి' అని చెప్పారు. 'ఇది కేజ్ ఫైట్ ఛాలెంజ్ అనిపిస్తుందే, సంస్థ తన పేరు పెట్టుకుంటేనే విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడీ ధనవంతుడు' అని మరికొందరు నెటిజన్లు స్పందించారు.