అగ్రరాజ్యం అమెరికాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
అగ్రరాజ్యం అమెరికాలోకి కూడా ఒమిక్రాన్ వైరస్ ప్రవేశించింది. నవంబరు 22వ తేదీన సౌతాఫ్రికా నుంచి అమెరికాలోకి అడుగుపెట్టిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అమెరికాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆ దేశ శ్వేతసౌథం వర్గాలు వెల్లడించాయి.
గత నెల 22వ తేదీన సౌతాఫ్రికా నుంచి కాలిఫోర్నియాకు ఓ వ్యక్తి వచ్చాడనీ, అదేనెల 29వ తేదీన అతినికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. కరోనా రెండు డోసులు తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని పేర్కొన్నారు.
ఇదిలావుంటే, అమెరికా అంటువ్యాధులు నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసి స్పందిస్తూ, అమెరికా పౌరులంతా వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అలాగే, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ముఖ్యంగా, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు విధిగా ధరించాలని కోరారు.