మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మే 2024 (09:41 IST)

ప్రపంచంలో పంది గుండె అమర్చిన తొలి వ్యక్తి మృతి!!

ప్రపంచంలోనే తొలిసారి పంది కిడ్నీ అమర్చిన (ట్రాన్స్‌ప్లాంటేషన్) చేయించుకున్న వ్యక్తి రిచర్డ్ స్లేమాన్ మృతి చెందారు. ఈయనకు వయసు 62 సంపత్సరాలు. రెండు నెలల క్రితం మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో వైద్యులు స్లేమాన్‌కు జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చారు. అది విజయవంతం కావడంతో రెండు వారాల తర్వాత ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత కూడా ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. అయితే, ఆయన తాజాగా ఉన్నట్టు ప్రాణాలు కోల్పోయాడు. 
 
అయితే, స్లేమాన్ ఆకస్మిక మరణానికి, ఆపరేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. అవయవ మార్పిడి వల్ల ఆయన మరణించలేదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. ఆయనకు అంతకుముందే మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ వచ్చిన రిచర్డ్‌కు 2018లో మరణించిన ఓ వ్యక్తి కిడ్నీని అణర్చారు. అయితే, అది విఫలం కావడంతో జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చారు.