సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 మార్చి 2024 (15:48 IST)

అమెరికా స్కాట్ కీ వంతెనను ఢీకొట్టిన కంటైనర్ షిప్.. భారీగా మృతులు?

Francis Scott Key Bridge
Francis Scott Key Bridge
అమెరికా బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఈ ఘటనలో ప్రాణనష్టంపై సమాచారం లేదు. కానీ మరణాల సంఖ్య భారీగానే వుంటుందని టాక్ వస్తోంది. పెద్ద కంటైనర్ షిప్ బ్రిడ్జి స్తంభాన్ని ఢీకొట్టడంతో, గుర్తు తెలియని సంఖ్యలో వాహనాలు, వ్యక్తులను పటాప్‌స్కో నదిలోకి పడిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
 
ఇందుకోసం సహాయక చర్యలను ముమ్మరం చేశామన్నారు. ఈ సందర్భంగా పలువురితో కూడిన బృందాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. డైవ్ అండ్ రెస్క్యూ టీమ్ వ్యక్తులను గుర్తించడానికి సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ ఘటనను సామూహిక ప్రమాదంగా అభివర్ణించింది. అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలంలో ఉన్నారు