ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (12:11 IST)

అది జరిగితే.. ముందు మునిగేది మంగళూరే.. నాసా

అంటార్కిటికా, గ్రీన్ లాండ్ మంచు కరిగితే.. ముందు మునిగేది మంగళూరేనని గ్రెడియంట్ ఫింగర్ ప్రింట్ మ్యాపింగ్ (జీఎఫ్ఎం) అనే కొత్త పరికరం కనుగొంది. దీని ద్వారా ప్రంచంలోని ఏయే ప్రాంతాల్లో ముంపు ప్రభావం అధికంగ

అంటార్కిటికా, గ్రీన్ లాండ్ మంచు కరిగితే.. ముందు మునిగేది మంగళూరేనని గ్రెడియంట్ ఫింగర్ ప్రింట్ మ్యాపింగ్ (జీఎఫ్ఎం) అనే కొత్త పరికరం కనుగొంది. దీని ద్వారా ప్రంచంలోని ఏయే ప్రాంతాల్లో ముంపు ప్రభావం అధికంగా ఉండబోతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో గ్రీన్‌ లాండ్‌, అంటార్కిటికాలలో మంచు శిలలు కరిగిపోతే న్యూయార్క్‌, లండన్‌, ముంబై లాంటి మహానగరాల కంటే ఎక్కువ ముప్పు మంగళూర్‌‌కి ఉందని జీఎఫ్ఎం పరికరం ద్వారా తేలింది.
 
ఈ మేరకు జరిగిన పరిశోధనలో భాగంగా 293 పోర్టు పట్టణాలను జీఎఫ్ఎం పరిశీలించింది. ఆ నివేదిక ఆధారంగా గ్రీన్‌ లాండ్‌ ఉత్తరాదితో పాటు తూర్పున ఉన్న మంచుపొరలు కరిగిపోవడం ద్వారా న్యూయార్క్ నగరానికి ఏర్పడే ప్రమాదం కంటే మంగళూరుకు ఏర్పడే ముప్పు ఎక్కువగా వుందని తెలిపింది. మంగళూర్ మాత్రమే కాకుండా కరాచీ, చిట్టగాంగ్‌, కొలంబో పట్టణాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని ఈ నివేదికలో నాసా హెచ్చరించింది. 
 
గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా అంటార్కిటికా నుంచి అతిపెద్ద మంచు ఫలకం విడిపోయిందని గతంలో నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే. ధృవప్రాంతాల్లో మంచు కరిగిపోవడం కారణంగా సముద్రజలాలు పొంగి వివిధ నగరాల ముంపుకు గురయ్యే అవకాశం వుందని నాసా తెలిపింది. ఈ ముంపు ప్రమాదంలో మంగళూరుతో పాటు దేశ వాణిజ్య నగరం ముంబై కూడా వుందని నాసా అధికారులు తెలిపారు.