ఆ చేపలు.. ఆల్కహాల్ మత్తులో.. ఆక్సిజన్ లేకున్నా బతుకుతాయట..
మంచు కొండల్లో వున్న చెరువుల్లో గోల్డ్ చేపలు ప్రాణాలతో చాలాకాలం బతికేందుకు ఆల్కహాల్‌ను వినియోగించుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఉత్తర ఐరోపాలో ఎత్తైన మంచు కొండలకు సమీపంలో వున్న చెరువుల్లో ఆక్
మంచు కొండల్లో వున్న చెరువుల్లో గోల్డ్ చేపలు ప్రాణాలతో చాలాకాలం బతికేందుకు ఆల్కహాల్‌ను వినియోగించుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఉత్తర ఐరోపాలో ఎత్తైన మంచు కొండలకు సమీపంలో వున్న చెరువుల్లో ఆక్సిజన్ లేకుండా గోల్డ్ ఫిష్‌లు కొన్ని నెలల పాటు ప్రాణాలతో జీవిస్తాయనే విషయాన్ని కనిపెట్టారు. బంగారు వర్ణం కలిగిన ఈ చేపలు ఆక్సిజన్ లేని సమయంలో లెటిక్ అనే ఆమ్లాన్ని ఆల్కహాలుగా మార్చుకుంటాయి.
ఆపై ఆ ఆల్కహాల్ మత్తులో కొన్ని నెలల పాటు ఆ గోల్డెన్ ఫిష్‌లు జీవించే సామర్థ్యాన్ని కలిగివుంటాయట. ఇలా ఆక్సిజన్ లేని సమయంలో గోల్డ్ చేపల రక్తంలో సగానికి సగం ఆల్కహాల్ వుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. క్రూసియన్ కార్ప్ అనే చేపలు కూడా ఇలాంటి క్లిష్టమైన వాతావరణంలోనూ జీవించే సామర్థ్యాన్ని కలిగివుంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.