గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (10:07 IST)

కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంటే ఉగ్రవాద ముద్ర వేస్తారా? పాక్ గగ్గోలు

కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంటే ఉగ్రవాద ముద్ర వేస్తారా? పాక్ గగ్గోలు

కాశ్మీర్‌లో స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం పోరాడుతున్న సంస్థలు, గ్రూపులను ఉగ్రవాద సంస్థలుగా పేర్కొనడం పూర్తిగా అన్యాయమని పాకిస్థాన్ పాలకులు గుండెలు బాదుకుంటున్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ పాకిస్థాన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌ను రెండు నెలల క్రితం అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
అలాగే, బుధవారం హిజ్బుల్ ముజాహిద్దీన్‌ను కాశ్మీర్‌‌లో అల్లర్లు సృష్టిస్తూ హింసకు పాల్పడుతున్న విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. దీంతో పాకిస్థాన్ పుండు మీద కారం జల్లినట్టైంది. దీనిపై పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల కార్యాలయ అధికార ప్రతినిధి నసీఫ్ జకారియా మాట్లాడుతూ, కాశ్మీర్‌లో స్వేచ్ఛ కోసం పోరాడుతున్న సంస్థలు, గ్రూపులను ఉగ్రవాద సంస్థలుగా పేర్కొనడం పూర్తిగా అన్యాయమన్నారు. 
 
పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కాశ్మీరీల స్వేచ్ఛ కోసం పోరాడుతానని ఉగ్రవాది సయ్యద్ సలాహుద్దీన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాక్ సైన్యం, గుఢచార సంస్థ ఐఎస్ఐ సహాయంతో కాశ్మీర్‌లో అల్లర్లకు హిజ్బుల్ ముజాహిద్దీన్‌ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.