శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (11:15 IST)

రాకాసి దోమల గుంపు.. వందలాది వన్యప్రాణులు బలి.. ఎక్కడ?

రాకాసి దోమల గుంపు వందలాది వన్య ప్రాణులను బలితీసుకుంది. ఇప్పటికే కరోన మహమ్మారితో అగ్రరాజ్యం వకిణిపోతుండగా.. తాజాగా రాకాసి దోమల గుంపు ఆ దేశంపై దండెత్తింది. రాకాసి దోమల గుంపు వందల సంఖ్యలో పాడి జంతువుల్ని, వణ్య ప్రాణుల్ని బలితీసుకుంది.

లూసియానాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెల 27న హరికేన్‌ లారా కారణంగా పెద్ద సంఖ్యలో రాకాసి దోమలు లూసియానాలోకి వచ్చిపడ్డాయి. 
 
ఈ  రాకాసి దోమల దాడిలో 400 పాడి జంతువులు, 30 జింకలు మృత్యువాతపడ్డాయి. దీంతో ఆ జంతువుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
రంగంలోకి దిగిన సహాయక బృందాలు హెలికాప్టర్ల సాయంతో దోమల మందును పిచికారీ చేశారు. దీంతో దోమల ఉధృతి కాస్త తగ్గింది. రాకాసి దోమలు గుంపులుగా వచ్చి గేదెలు, ఆవులు, గుర్రాలు, జింకలపై దాడి చేశాయి. వాటి రక్తాన్ని పీల్చి చంపేశాయని.. దీంతో అవి ప్రాణాలు కోల్పోయానని అధికారులు తెలిపారు.