కేవలం 14 గంటల వ్యవధిలో 800 భూకంపాలు
ప్రపంచ చరిత్రలో ఎన్నో విపత్తులు సంభవించాయి. వీటిలో భూకంపాలు, ప్రళయాలు వంటివి చాలా చోటుచేసుకున్నాయి. కానీ కేవలం 14 గంటల వ్యవధిలో 800 భూకంపాలు సంభవించాయి. ఈ విపత్కర పరిణామం ఐరోపాకు చెందిన ద్వీప దేశం ఐస్‌లాండ్‌లో వెలుగు చూసింది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుస భూ ప్రకంపనాల కారణంగా ఆ ప్రాంతం వణికిపోయింది. ఈ దెబ్బకు ఎంతో ఆస్తినష్టం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఎమెర్జెన్సీ ప్రకటించారు. తొలుత శుక్రవారం తెల్లవారుజామున ఐస్‌లాండ్‌లో భూమి కంపించింది.
రిక్టర్ స్కేలుపై ఈ భూకంపాల తీవ్రత 5.2గా నమోదైంది. ఈ దెబ్బకు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో.. అధికారులు ఆ ప్రాంతంలో రాకపోకల్ని నిలిపివేశారు.