శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (11:06 IST)

ప్రపంచ దేశాల్లో కరోనా.. భారత్‌లోనూ రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు

ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ చుక్కలు చూపిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో భారీగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,73,552కి చేరింది. అలాగే ఇప్పటివరకు కరోనా బారిన పడి 8,78,083 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకుని 1,88,83,183 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 70,12,286 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
భారత్‌లో కరోనా కొత్త కేసులు రోజురోజుకీ గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,59,346 పరీక్షలు నిర్వహించగా.. 86,432 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179కి చేరింది. వీరిలో 8,46,395 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 31,07,223 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 1,089 మంది మహమ్మారికి బలయ్యారు.