శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 31 అక్టోబరు 2018 (09:21 IST)

విషాదంగా ముగిసిన భారతీయ జంట సాహస యాత్ర

అమెరికాలో సాహస యాత్ర చేపట్టిన భారతీయ జంట కథ విషాదంగా ముగిసింది. ఆ దేశంలోని యోసెమైట్‌ నేషనల్‌ పార్కులో 800 అడుగుల లోయలో పడి ఈ జంట ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కాలిఫోర్నియా రాష్ట్రంలోని యోసెమైట్‌ నేషనల్‌ పార్కు ఉంది. ఈ పార్కులో సహస యాత్ర కోసం భారత్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన విష్ణు విశ్వనాథ్ (29), మీనాక్షి మూర్తి (30)లు వెళ్ళారు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. కేరళలోని చెంగన్నూర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ పూర్వ విద్యార్థులు. 2014లో వారి వివాహమైంది. వీరు తొలుత న్యూయార్క్‌లో నివసించారు. ఇటీవలే కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌ జోస్‌ నగరానికి మారారు. 
 
ఈ జంట ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ, తమ సాహస యాత్రల వివరాలను 'హాలిడేస్‌ అండ్‌ హ్యాపీలీ ఎవర్‌ ఆఫ్టర్స్‌' అనే బ్లాగ్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. యోసెమైట్‌లోనూ పార్కులోని నిటారుగా ఉండే ఎత్తైన కొండను వీరు అధిరోహించారు. అక్కడి నుంచి వీరు జారి కింద పడిపోయి ఉంటారని భావిస్తున్నారు. గత బుధవారం వీరి మృతదేహాలను పర్యాటకులు గుర్తించారు. మేలో తెలుగువాడైన ఆశిష్‌ పెనుగొండ(29) కూడా ఇదే పార్కులోని ప్రఖ్యాత హాఫ్‌ డోమ్‌పైకి వెళ్లే క్రమంలో జారిపడి మరణించారు.