శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (16:16 IST)

లండన్ థేమ్స్ నదిలో శవమై తేలిన తెలుగు విద్యార్థి

student
student
లండన్‌లోని కానరీ వార్ఫ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న థేమ్స్ నదిలో తెలుగు విద్యార్థి శవమై కనిపించాడు. అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. 
 
మరణానికి గల కారణాలపై విచారిస్తున్నారు. వాకింగ్ కోసం బయటకు వెళ్లిన మిత్ కుమార్ డెడ్ బాడీ థేమ్స్ నదిలో కనిపించింది. గత నెలలో తప్పిపోయిన భారతీయ విద్యార్ధి శవమై కనిపించడం అతడి కుటుంబీకులను షాక్‌కు గురిచేసింది. 
 
భారత్‌లో ఓ రైతు కుటుంబానికి చెందిన మిత్ కుమార్ ఉన్నత చదువుల కోసం సెప్టెంబర్‌లో యూకే వెళ్లాడు. నవంబర్ 17 నుండి కనిపించకుండా పోయాడు. నవంబర్ 21న అతడు శవమై నదిలో తేలాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.