గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (17:53 IST)

కరోనా వైరస్.. శృంగారంలో ఈ మెలకువలు అవసరమట..

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. శారీరక కలయికల నుంచి విరామం తీసుకోవడం శ్రేయస్కరమని.. ఐర్లాండ్ పేర్కొంది. ఈ మేరకు.. మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో.. శృంగారంలో పాల్గొనాలనుకునేవాళ్లు సురక్షితమైన పద్ధతులను అవలంబించాలని ఆ దేశం తన ఆరోగ్య సూచనల్లో పేర్కొంది. ప్రస్తుత సమయంలో సేఫ్ సెక్స్ ఉత్తమమైందని ప్రజలకు ఐర్లాండ్ సూచించింది. 
 
జీవిత భాగస్వామితో చేస్తున్నవారితో మాత్రమే సెక్స్‌లో పాల్గొనాలని, లేదంటే వైరస్ లక్షణాలు లేనటువంటి వారితో శృంగారం చేయాలని ఐర్లాండ్ గైడ్‌లైన్స్ జారీ చేసింది. బయటి వ్యక్తులకు కానీ, వైరస్ సంక్రమించిన వారికి కానీ కిస్సులు ఇవ్వకూడదంటూ హెల్త్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఆదేశించారు. ఇతరులతో పంచుకునే కీబోర్డులు, టచ్ స్క్రీన్లను ఇన్‌ఫెక్షన్ ఫ్రీ అయ్యేలా చూసుకోవాలన్నారు.