శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (20:34 IST)

కోట్లు పెట్టి వజ్ర, బంగారంతో మాస్క్ చేయించాడు.. మిలమిలా మెరిసిపోతుందిగా..?

Mask
కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించడం తప్పనిసరిగా మారింది. ఈ మాస్కులు బయట కూడా కొనుక్కోకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు.. చాలామంది. మరికొందరు ఫ్యాషన్‌కు తగినట్లుగా మ్యాచింగ్ మాస్క్‌లు ఫాలో అవుతున్నారు. 
 
ఇక సౌండ్ పార్టీలయితే ఏకంగా బంగారంతోనే మాస్కులు తయారు చేయించుకుంటున్నారు. కొందరు లక్షల్లో బంగారు మాస్కుల కోసం పెడితే.. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కస్టమర్ మాత్రం ఏకంగా కోట్లే పెట్టేశాడు.
 
నగల తయారీ సంస్థ యవెన్ కంపెనీ మాస్క్‌ను బంగారం, వజ్రాలను కలిపి తయారు చేసిందని వెల్లడించింది. ఈ బంగారు మాస్క్ తయారీ కోసం 18 క్యారెట్ల తెల్ల బంగారం, 3,600 తెల్ల, నల్ల డైమండ్లను ఉపయోగించి డిజైన్ చేశారు. దీన్ని చూస్తే మిలమిలా మెరిసిపోతుంది. 
 
అంతేకాదు ఈ మాస్క్‌కు N99 ఫిల్టర్లను కూడా అమర్చారు. ఇంత విలువైన మాస్క్‌ను కస్టమర్ ఎంతో ఇష్టంగా తయారు చేపించుకున్నాడని ఇసాక్ లావేయ్ వెల్లడించారు. ఈ మాస్క్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.