మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఇజ్రాయేల్‌లో వ్యాక్సిన్ పంపిణీ - టీకా వేయించుకున్న బెంజిమన్‌

ఇజ్రాయేల్‌ దేశంలో కరోనా వ్యాక్సినేషన్ అధికారికంగా ప్రారంభమైంది. ఫార్మా దిగ్గజం ఫైజర్ బయో‌ఎన్‌టెక్ అభివృద్ధి చేసిన టీకాల పంపిణీకి ఆ దేశం శ్రీకారం చుట్టింది. ఈ వ్యాక్సిన్‌లో భాగంగా, తొలి టీకాను ఆ దేశ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతన్యాహూ స్వీకరించారు. తద్వారా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టయింది. 
 
ఆ దేశ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు తొలి టీకా వేయించుకున్నారు. ఫలితంగా టీకా తీసుకున్న తొలి ఇజ్రాయెలీగా ఆయన రికార్డులకెక్కారు. అంతేకాదు, టీకా వేయించుకోవడం ద్వారా వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న భయాందోళనలను పారదోలే ప్రయత్నం చేశారు. 
 
ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ చిన్న ఇంజెక్షన్ ద్వారా ఎంతోమంది ఆరోగ్యాలను రక్షించవచ్చన్నారు. దీనిని పెద్ద ముందడుగుగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, ఇప్పటివరకు ఇజ్రాయెల్ వ్యాప్తంగా 3.72 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 3,070 మంది ప్రాణాలు కోల్పోయారు.