బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (13:01 IST)

భవిష్యత్తులో రెండో కొరియన్ యుద్ధం జరగకపోవచ్చు.. కిమ్..!!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రస్తుతం శాంతి ప్రవచనాలు పలుకుతున్నారు. ఎప్పుడూ దక్షిణ కొరియాతో పాటు అమెరికాపై గుర్రుగా వుండే కిమ్ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు.

నిత్యం అణ్వస్త్రాలు తయారు చేస్తూ, క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించే కిమ్ ప్రస్తుతం అభివృద్ధిపై కన్నేశారు. ఇంకా పరిశ్రమలు నెలకొల్పడంపై దృష్టి పెట్టారు.
 
కొరియా యుధం ముగిసి 67 సంవత్సరాలైంది. సోమవారం రోజున (జూలై 27) 67వ వార్షికోత్సవాలు జరుపుకున్నారు. ఈ వార్షికోత్సవంలో కిమ్, మాజీ ఆర్మ్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

దేశం అణ్వస్త్రాలను కలిగి ఉందని, తమ దేశం జోలికి ఎవరు వచ్చినా ఊరుకోబోమని చెప్తూనే, అన్ని దేశాలు సరిహద్దు విషయాల్లో దౌత్యపరమైన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీనికి ప్రధాన కారణం అత్యాధునిక ఆయుధాలు, అణ్వస్త్రాలే అని చెప్పుకొచ్చారు. ఉత్తర కొరియా సైతం అణ్వస్త్రాలను కలిగి ఉన్నట్టు అయన తెలిపారు. సమీప భవిష్యత్తులో రెండో కొరియన్ యుద్ధం జరగకపోవచ్చని అన్నారు.