బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (11:43 IST)

కిమ్ చెప్పినట్లు వింటున్న డొనాల్డ్ ట్రంప్.. 3 నెలల్లో 17 మంది ఖైదీల విడుదల

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ చెప్పినట్లు వింటున్నారట. ఖైదీలకు వేస్తున్న శిక్షల్ని తగ్గించాలనే అంశంపై మాట్లాడేందుకు కిమ్ కర్దాషియన్ గతేడాది వైట్‌హౌస్‌కి వెళ్లింది. అధ్యక్షుడు ట్రంప్‌ని కలిసింది. ఫలితంగా ఫస్ట్ టైమ్ డ్రగ్ కేసులో పట్టుబడి... జీవిత ఖైదు అనుభవిస్తున్న 60 ఏళ్ల మహిళకు ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. 
 
ఇలా ఇప్పటివరకూ 17 మందికి కఠిన శిక్షలు తప్పేలా చేసింది కిమ్ కర్దాషియన్. ఇన్‌స్టాగ్రాంలో 13 కోట్ల 60 లక్షల మంది ఫాలోయర్లున్న ఈ భామ... 90 రోజుల స్వేచ్ఛ పేరుతో కొత్త ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా ట్రంప్‌ను కలిసిన కిమ్.. ఖైదీలకు స్వేచ్ఛనిచ్చే అంశంపై ట్రంప్‌తో చర్చించింది. 2022 నాటికి లాయర్ అవ్వాలని కలలు కంటున్న కిమ్ కర్దాషియన్... వారానికి 18 గంటలపాటూ బుక్స్ చదువుతోంది. బార్ ఎగ్జామ్ పాసై లాయర్ అవుతానంటోంది.
 
ఇక డ్రగ్స్ కేసుల్లో దొరికిపోయి... ఫస్ట్ స్టెప్ చట్టం కింద జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్లు అమెరికాలో వందల్లో ఉన్నారు. వాళ్లకు కొత్త జీవితాన్ని ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్న కిమ్‌కి ఆమె తరపు లాయర్ల నుంచీ పూర్తి మద్దతు లభిస్తోంది. 
 
ఈ ప్రచారం కోసం అవసరమైన నిధులను కిమ్ సమకూర్చుతోందని ఆమెకు సంబంధించి ఖైదీల తరపున వాదించే లాయర్లు బ్రిట్టనీ బార్నెట్, మి యాంజెల్ కోడీ తెలిపారు. బతికి ఉన్న ఖైదీలను అలాగే పూడ్చి పెట్టే కార్యక్రమాన్ని (Buried Alive Project) వ్యతిరేకిస్తున్న కిమ్... అలాంటి శిక్ష పడిన ఖైదీల ఆవేదనను ప్రపంచానికి తెలియజేస్తోంది.