గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

Gotabaya Rajapaksa
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయి రాజపక్సే దేశం వడిచి పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. కొలంబోలోని దేశ అధ్యక్ష భవనంలోకి ఆందోళనకారులు దాడికి ముందే ఆయన దేశాన్ని విడిచి పారిపోయినట్టు సమాచారం.
 
బుధవారం తెల్లవారుజామున ఆయన భార్య సహా ఇద్దరు అంగరక్షకులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పరారైనట్లు వైమానిక అధికారి వెల్లడించారు. 
 
కాగా అధ్యక్ష పదవికి రాజీనామా విషయంలో తనను దేశం వీడి పోయేందుకు అనుమతిస్తేనే.. పదవి నుంచి వైదొలగుతానని మంగళవారం ఆయన మాట మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పారిపోయాడు. పైగా, బుధవారం ఆయన తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు.